ఎప్పటికీ మరవలేం బాలుగారి మాట ఆయన పాట.. మనలో ఎప్పటికీ ఆ పాటలు వినిపిస్తూనే ఉంటాయి, ఆయన భౌతికంగా మన మధ్య లేరు అంతే కాని ఆయన పాడిన పాటలు మనతోనే ఉంటాయి, అంత గొప్ప వ్యక్తి, ఎంతో గొప్ప మంచి మనసు కలిగిన సింగర్, దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆయన పాడిన పాటలు మరెవ్వరూ పాడలేదు.
ఆయన ఇటీవల మరణించడం నిజంగా చేదు విషయమే, ఈ 2020 మనకి బాలుగారిని దూరం చేసింది, అయితే ఆయన పలు భాషల్లో పాటలు పాడారు, ఇక తమిళంలో కొన్ని వేల పాటలు పాడారు ఆయన.
గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి నివాళిగా తమిళనాడుకు చెందిన ఓ స్వచ్చంద సంస్థ ఎస్పీబీ వనం పేరిట ఓ పార్కును నిర్మించబోతుంది.
74 ఏళ్ల వయస్సులో బాలుగారు మరణించారు, అందుకే ఆయన పేరిట ఈ వనంలో 74 మొక్కలు నాటుతారు, అంతేకాదు ఆయన పాడిన పాటలు ఈ మొక్కలకు పేర్లుగా పెడుతున్నారు, ఇక ఆయన పాటలకు సంబంధించి లైబ్రెరీ ఏర్పాటు కాబోతోంది. ఇది తమిళనాడులోని కోయంబత్తూరులో సిరు తుళిఅనే స్వచ్చంద సేవా సంస్థ నిర్మించనుంది, మొత్తం దీని కోసం 1.8 ఎకరాలను పార్కుగా ఏర్పాటు చేస్తున్నారు. అందరూ ఈ విషయం తెలిసి హర్షిస్తున్నారు.