సర్కారు వారి పాట సినిమాకి మహేష్ రెమ్యునరేషన్ ఎంతంటే ?

What is Mahesh's Remuneration for that film?

0
109

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ కుంభకోణంలో ఇరుక్కున్న‌ తన తండ్రిని కాపాడుకునే కొడుకుగా మహేష్ ఈ సినిమాలో కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మంచి స్టోరీతో మహేష్ ని కలవగానే పరశురామ్ కి ఒకే చెప్పారట ప్రిన్స్.

ఇప్పటికే కొంత భాగం షూటింగ్ దుబాయ్, గోవాలో పూర్తి చేసుకున్నారు. ఇక స్పెయిన్ కు వెళ్లనున్నారని తెలుస్తుంది. తాజాగా మహేష్ రెమ్యునరేషన్ గురించి చర్చ జరుగుతుంది. ఇక టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నస్టార్ హీరోల్లో మహేష్ కూడా ఒకరు.

ఇక ఈ సినిమాకి దాదాపు 40 నుంచి 50 కోట్ల మధ్య ఆయన రెమ్యునరేషన్ ఉండవచ్చని టాలీవుడ్ టాక్.

మహేష్ తో సినిమా చేయడానికి దర్శకులంతా ఎదురు చూస్తుంటారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఈ సినిమా. ఇప్పటికే చాలా మంది దర్శకులు ఆయనతో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. విడుదలైన చిత్ర టీజర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా 2022 జనవరి 13వ తేదీన ఈ చిత్రం విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.