పుష్ప పార్ట్-2లో సుకుమార్ ఏం చూపించబోతున్నారు?

0
131
Pushpa 2

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి అర్ధం ఉన్న కథలను ఎంచుకుంటూ విశేష ప్రేక్షాదరణ సొంత చేసుకున్నాడు. ముఖ్యంగా ఇటీవలే సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన ‘పుష్ప’ సినిమా దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించింది.

పుష్పకి సీక్వెల్ గా పుష్ప పార్ట్-2 కూడా తీయడానికి చిత్రబృందం అన్ని సన్నాహాలు చేస్తూ బన్నీ ఫాన్స్ ను ఖుషి చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా షూటింగును పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ అంటున్నారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి, 6 నెలల్లో అన్ని పనులను పూర్తి చేసి సంక్రాంతి బరిలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

అయితే పుష్పలో ఫస్ట్ ఆఫ్ లోనే ఎర్రచందనం అడ్డా ఏర్పాటు చేసుకున్న పుష్పరాజ్ సెకాండాఫ్ కి వచ్చే సరికి తనని తాను రక్షించుకోవడానికి పాలిటిక్స్ లోకి వెళ్తాడా? తన చీకటి సామ్రాజ్యాన్ని విదేశాలకు సైతం విస్తరించి, పెద్ద డాన్ గా అవతరిస్తాడా? ఇక టిపికల్ ఎస్పి భన్వర్ సింగ్ ని మైండ్ గేమ్ తోనే కొట్టి ఎదుర్కొంటాడా? చివరికి పుష్పరాజ్ అరెస్టయిపోతాడా? అంతమైపోతాడా? అనే చర్చ నడుస్తోంది.