సూపర్ స్టార్ కృష్ణ-బాలుకు మధ్య గొడ‌వ ఏమిటి ? అస‌లు ఏమైంది

-

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సినిమా ప‌రిశ్ర‌మ‌లో 50 ఏళ్లుగా ఉన్నారు, దాదాపు 41000 పాటలు పాడారు, అంతేకాదు 16 భాష‌ల్లో పాట‌లు పాడిన ఘ‌న‌త ఆయ‌న‌కు ఉంది, అయితే ఆయ‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రితో వివాదం లేకుండా ఉన్నారు.

- Advertisement -

కాని సూపర్ స్టార్ కృష్ణకు ఆయ‌న‌కు మ‌ధ్య ఓ విష‌యంలో క్లాష్ వ‌చ్చింది, ప‌లు ఇంట‌ర్వ్యూల్లో ఆయ‌న దీని గురించి తెలిపారు… ఓసారి టెలిఫోన్లో మాట్లాడుకుంటుండగా ఇద్దరి మధ్య వివాదం తలెత్తిందన్నారు. ఎన్నడూ కఠినంగా మాట్లాడని ఆయన అంటే కృష్ణ‌గారు కూడా అలాగే మాట్లాడారు నేను అలాగే మాట్లాడాను.

చివ‌ర‌కు ఆనాటి నుంచి ఆయనకు పాటలు పాడటం మానేసినట్లు తెలిపారు. అయినప్పటికీ తాను ఎక్కడ కలిసినా కృష్ణ గారు మామూలుగానే మాట్లాడేవారని బాలు అన్నారు, చివ‌ర‌కు ఓ రోజు మా వ‌ల్ల ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇబ్బంది ప‌డుతున్నారు అని అంద‌రూ అన్నారు, మీరు కృష్ణ‌గారికి పాట‌లు పాడాలి అని చాలా మంది కోరారు, అయితే ఓరోజు వేటూరిగారు ఆయ‌న‌తో మాట్లాడారు, ఆయ‌న కూడా బాలుతో నాకు ఇబ్బంది లేదు అని చెప్పారు, చివ‌ర‌కు నేను కృష్ణ‌గారిని క‌లిశాను ఆయ‌న స్టూడియోలో, అయితే ఆరోజు ఇక పాత విష‌యాలు మ‌ర్చిపోండి మ‌నం క‌లిసి ప‌ని చేస్తున్నాం అని కృష్ణ‌గారు అని చేతులు క లిపారు మళ్లీ ఆరోజు నుంచి ఆయ‌న సినిమాల‌కు పాట‌లు పాడాను అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Champions Trophy | సౌత్ఆఫ్రికాపై కివీస్ ఘన విజయం

ఛాంపియన్ ట్రోఫీ-2025(Champions Trophy) రెండో సెమీఫైనల్స్‌లో న్యూజిల్యాండ్ ఘటన విజయం సాధించింది....

Rahul Gandhi | రాహుల్‌కి రూ.200 ఫైన్.. ఆ వ్యాఖ్యలే కారణం..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ఉత్తర్‌ప్రదేశ్ న్యాయస్థానం రూ.200ఫైన్ విధించింది....