బిగ్ బాస్ సీజన్ 5 లో ఈ ఐదుగురికి హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ?

What is the highest remuneration for these five in Bigg Boss Season 5?

0
91

జస్ట్ ఇక రెండు రోజుల్లో బిగ్ బాస్ సందడి మొదలు కానుంది. తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షో క్రేజ్ ఎంత అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సీజన్ నుంచి నాల్గో సీజన్ వరకూ ప్రేక్షక ఆదరణ పెరుగుతూనే ఉంది. బిగ్ బాస్ నాలుగు సీజన్లు విజయంతంగా ముగిశాయి. ఇక మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ మాలో ప్రసారం కానుంది.

ఇప్పటికే 16 మంది కంటెస్టెంట్లను ఖరారు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. చాలా మంది పేర్లు వైరల్ అవుతున్నాయి. దాదాపు 30 మంది పేర్లు వినిపించినా అందులో 16 మంది హౌస్ లోకి వెళుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రియ, నటరాజ్ మాస్టర్, అనీ మాస్టర్, శ్వేతా వర్మ, ఉమాదేవి, మానస్, షణ్ముఖ్, వి.జె.సన్నీ, ప్రియాంక సింగ్, లోబో, శ్రీరామ్, ఆర్జే కాజల్, జశ్వంత్, లహరి, సిరి హనుమంత్, సరయు, విష్ణు ఉన్నారు.

ఇక రేపు షూట్ ఉండనుందట వీరంతా ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. ఇక ఈసారి సీజన్ లో ఎవరికి ఎక్కువ రెమ్యునరేషన్ అనే టాపిక్ కూడా వస్తోంది. యాంకర్ రవి, షణ్ముక్, కార్తీకదీపం సీరియల్ నటి ఉమాదేవి, ప్రియ, అనీ మాస్టర్, కి అత్యధిక పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారానికి ఒక్కొక్కరికి రెమ్యునరేషన్ 2 నుంచి 3 లక్షలు పైనే ఉంటుంది అని తెలుస్తోంది