కృతిశెట్టి కి బంగార్రాజులో భారీ రెమ్యునరేషన్ ఎంతంటే ?

What is the huge remuneration of Kriti shetty in Bangar raju movie ?

0
93

హీరోయిన్లు అయినా, హీరో అయినా సినిమా హిట్ అయింది అంటే కచ్చితంగా తర్వాత సినిమాల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటారు. కథలో మంచి పాత్ర అయితేనే చేస్తారు. ఇక పారితోషికం విషయంలో కూడా ఒక సినిమా హిట్ అయిన తర్వాత పెంచుతారు అనే విష‌యం తెలిసిందే.

నిర్మాతలు కూడా అడిగినంతా రెమ్యున‌రేష‌న్ ఇచ్చేస్తారు. అలాగే తాజాగా అందాల తార‌ కృతిశెట్టి కూడా పారితోషికం విషయంలో కాస్త రేటు పెంచింది అని వార్తలు వినిపిస్తున్నాయి.ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది కథానాయిక కృతిశెట్టి. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఆమెకి అవకాశాలు అలాగే వస్తున్నాయి.

సినిమాకి 50 లక్షల వరకు తీసుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు 75 లక్షలు ఛార్జ్ చేస్తోందట. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమా రానుంది. ఈ సినిమాలో చైతూ సరసన కృతిశెట్టిని హీరోయిన్ గా తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి 75 లక్షల రెమ్యునరేషన్ అని టాక్ నడుస్తోంది. అయితే ఆమెకి కోటి రూపాయలు ఇచ్చినా పర్వాలేదు అంటున్నారు ఆమె అభిమానులు. అంత బాగా నటిస్తోంది అంటున్నారు.