బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం ఎన్నో అంచనాలతో నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో అఖిల్ హిట్ కొట్టాడో లేదో తెలుసుకుందాం.
హర్ష (అఖిల్) అమెరికాలో ఉద్యోగం చేస్తుంటాడు. ఖరీదైన వస్తువులన్నీ ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాడు. ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకొని తనకు ఓ జోడీని వెతుక్కునేందుకు హైదరాబాద్ వస్తాడు. ఎంతోమంది పెళ్లి కూతుళ్లను చూస్తాడు. అందులో ఒకరైన విభ (పూజా హెగ్డే) హీరోకు పిచ్చిపిచ్చిగా నచ్చేస్తుంది. కానీ ఆమె ఫ్యామిలీ మెంబర్స్ హర్షను రిజెక్ట్ చేస్తారు. ఇంతలో విభకు పెళ్లి మీద ఇంట్రస్ట్ లేదన్న విషయం హర్షకు తెలుస్తుంది. అసలు విభకు పెళ్లంటే ఎందుకు విరక్తి? ఆమెను తనతో పెళ్లికి హీరో ఎలా ఒప్పించాడు? ఈ క్రమంలో ఎదురయ్యే పరిస్థితులేంటి. వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
బొమ్మరిల్లు భాస్కర్ ఎప్పుడూ చిన్న లైన్‌తోనే సినిమా తీయాలనుకుంటాడు. ఫస్టాఫ్‌లోని కొన్ని సన్నివేశాలు బొమ్మరిల్లు సినిమాను గుర్తు చేస్తాయి. మొత్తానికి ఫస్ట్ భాగం అదరహో అనిపించినా సెకండాఫ్ మాత్రం అంతగా పండలేదు. ఫస్టాఫ్ మొత్తం ఫుల్ ఫన్ అండ్ రొమాంటిక్‌గా సాగుతుందట. ఇందులో వచ్చే కామెడీ ట్రాక్, లవ్ ట్రాక్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ అదిరిపోతుందట. అయితే, సెకెండాఫ్ మాత్రం ఏమాత్రం ఆకట్టుకోని విధంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సెకండాఫ్ ఇంకా బాగుంటే ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యేదే.
నటన పరంగా అఖిల్ క్లాప్స్ కొట్టించాడు. తనకు సరిగ్గా సూట్ అయ్యే పాత్ర సెలక్ట్ చేసుకుని నటనతో అదుర్స్ అనిపించాడు. పూజా హెగ్డే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించింది. రియల్ కపుల్ చిన్మయి శ్రీపాద, రాహుల్ రవీంద్రన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మురళీ శర్మ, జేపీలకు అలవాటైపోయిన పాత్రలే పడ్డాయి. ముఖ్యంగా లెహరాయి సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటుంది.
బలాలు: అఖిల్ యాక్టింగ్, ఫస్టాఫ్, పాటలు, నేపథ్య సంగీతం
బలహీనతలు: సెకండాఫ్, క్లైమాక్స్.
రేటింగ్: 2.75/5