పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు.. ఇక తాజాగా వకీల్ సాబ్ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు, ఇక క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా కూడా స్టార్ట్ చేశారు… అలాగే ఈ చిత్రం జానపద పీరియాడిక్ కథగా తెరకెక్కుతోంది. ఇక ఓ షెడ్యూల్ కూడా షూటింగ్ పూర్తి అయింది.
ఇక ఇందులో పవన్ కల్యాణ్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండజ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారట.. అయితే ఇందులో బాలీవుడ్ కీలక నటుడు నటిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి బాలీవుడ్ లో. నటుడు అర్జున్ రాంపాల్ ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి బీ టౌన్ నుంచి టాలీవుడ్ వరకూ.
ఆయన ఏ పాత్రలో నటిస్తారు అంటే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం, అర్జున్ రాంపాల్ ఇందులో మోఘల్ రాజు ఔరంగజేబు పాత్రలో కనిపించినున్నారట. ఈ సినిమాతో పాటుగా అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా కూడా చేస్తున్నారు పవన్ ఇందులో రానా కూడా నటిస్తున్నారు.