బాలీవుడ్ స్టార్లు ఈ మధ్య మన తెలుగు సినిమాల్లో అవకాశాలు బాగా అందుకుంటున్నారు.. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తెలుగులో ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నారు. అయితే తాజాగా మరో సినిమాలో కూడా ఆయన నటిస్తున్నారు అనే వార్త బీ టౌన్ మీడియాలో వినిపిస్తోంది.. అక్కడ నుంచి టాలీవుడ్ కు ఈ వార్తలు వచ్చాయి.. మరి ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏమిటి అనేది చూద్దాం.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఆదిపురుష్ మూవీ చేస్తున్నారు… దీనితో పాటు సలార్ కూడా చేస్తున్నారు ఆయన.. తాజాగా ఆదిపురుష్ చిత్రంలో అజయ్ దేవగన్ ఓ కీలక రోల్ చేస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి..బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రాన్ని..
ప్రభాస్ రాముడిగా- సైఫ్ అలీఖాన్ రావణుడి గా నటిస్తున్నారు. అయితే ఇందులో అజయ్ దేవగన్ శివుడి పాత్ర చేస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి..బీ టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి కాని ఈవిషయంపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.