సర్కారు వారి పాటలో అర్జున్ చేసే పాత్ర అదేనా ?

What is the role of Arjuns in Sarkaru Vaari Paata a movie

0
87

యాక్షన్ కింగ్ అర్జున్ కి సౌత్ ఇండియాలో ఎంత ఫేమ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన యాక్షన్ సినిమాలు చాలా మందికి నచ్చుతాయి. తెలుగు తమిళ్ లో అనేక సినిమాలు చేశారు. ఎక్కువగా తమిళంలో ఆయన చేసిన చాలా సినిమాలు తెలుగులో అనువాదాలుగా వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఆయన తెలుగులో ప్రతినాయకుడి పాత్రలు కూడా చేస్తున్నారు.

సర్కారువారి పాట సినిమాలో ఆయన ఒక కీలకమైన పాత్రను చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో ఆయనే విలన్ అనుకున్నారు. అయితే తాజాగా ఆయన ఈ సినిమాలో విలన్ రోల్ చేయడం లేదు అని తెలుస్తోంది. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు.

గతంలో పోలీస్ అర్జున్ ఆఫీసర్ గా చేసిన చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర కూడా పోలీస్ ఆఫీసర్ పత్ర అని వార్తలు వినిపిస్తున్నాయి. మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోంది ఈ సినిమా . ఇందులో కీర్తీ సురేష్ హీరోయిన్.