పవన్ కల్యాణ్ నటించిన  వకీల్ సాబ్ చిత్రానికి ముందు టైటిల్ ఏమనున్నారంటే

-

ఏప్రిల్ 9న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం విడుదల కానుంది.. ఇక చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్లతో బిజీగా ఉంది…ఇక తాజాగా ఓ కార్యక్రమంలో వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు. ఈ సమయంలో అనేక విషయాలు పంచుకున్నారు… అయితే ముందు వకీల్ సాబ్ సినిమాకి టైటిల్ వేరేది అనుకున్నారట.
మగువా అనే టైటిల్ అయితే సరిపోతుందని భావించామని కాని తర్వాత  ఆ టైటిల్ ఆలోచన విరమించాము అని తెలిపారు, ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని వకీల్ సాబ్ అనే టైటిల్ ఖరారు చేశారు, ఇక ఈ కథ ఆత్మ దెబ్బ తీనకుండా కథలో పాటలకు స్ధానం ఇచ్చాము అని తెలిపారు… ఇక ఈ సినిమాకి మంచి సంగీతం అందించారని తమన్ బాణీలు బాగున్నాయి అని అన్నారు.
ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది…ఇక ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు..
ముఖ్యపాత్రల్లో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల నటించారు. ఇక ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...