మహాసముద్రం చిత్రంలో సిద్దార్థ్ రెమ్యునరేషన్ ఎంతంటే ? సూపర్ క్రేజ్

What was Siddharth's remuneration for the film Mahasamudram?

0
169

ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం మహాసముద్రం. ఈ చిత్రంలో హీరో సిద్దార్ద్ కూడా నటిస్తున్నారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత సిద్దార్థ్ మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఓ మై ఫ్రెండ్ తర్వాత సిద్ధార్థ్ మళ్లీ తెలుగులో నేరుగా సినిమా చేయలేదు. తమిళ్ లో చేసిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి.

అయితే సిద్దూ ఫ్యాన్స్ ఆయన సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో తెలుగులో మంచి పేరు సంపాదించుకున్నాడు హీరో సిద్దార్థ్. లవర్ బాయ్ చిత్రాలకు ఆయన కేరాఫ్ అడ్రస్ అయ్యారు. ఇక టాలీవుడ్ లో ఓ చరిత్ర క్రియేట్ చేసిన చిత్రం బొమ్మరిల్లు. ఈ చిత్రంతో సిద్దూ ఎంతో ఫేమస్ అయ్యారు.

అయితే ఇప్పుడు ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తీస్తున్న మహాసముద్రంలో చేస్తున్నారు. ఇందులో శర్వానంద్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. సిద్దార్థ్ కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. సిద్దార్థ్ ఈ సినిమా కోసం ఏకంగా రూ. 3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనేది టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.