ఇటీవల చిరంజీవి మేనల్లుడు.. హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన చిత్రం విడుదలైంది, ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.. టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించారు ఈ సినిమాకి, ఇక వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు అందుకుంది ఈ చిత్రం, టాలీవుడ్ లోనే కాదు దేశంలోనే తొలి డెబ్యూ మూవీగా ఇంత హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించింది ఉప్పెన..
ఇక ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు…తాజాగా ఈ సినిమా ఓటీటీపై కూడా ఓ వార్త వచ్చింది. ఉప్పెన ఈనెల 24న స్ట్రీమింగ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాని మొబైల్ పీసీలో చూడాలి అని చాలా మంది ఎదురుచూస్తున్నారు, ఇక ఈ సినిమాకి కథ పాటలు నటన అన్నీ కూడా ప్లస్ అయ్యాయి.
ఇక హీరో హీరోయిన్ దర్శకుడికి ఈసినిమా మంచి పేరు తెచ్చింది… ఇటు దర్శకుడు బుచ్చిబాబు కూడా మరో రెండు సినిమాలు చేసేందుకు సిద్దంగా ఉన్నారు.. ఇక వైష్ణవ్ కు కూడా చాలా మంది దర్శకులు పలు కథలు వినిపిస్తున్నారు, ఇక ఓటీటీలో వస్తే
చూడాలి అని మెగా అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు…నెట్ఫ్లిక్ స్లో ఉప్పెన స్ట్రీమింగ్ అవుతుంది అని టాక్ నడుస్తోంది.
ReplyForward
|