‘భీమ్లానాయక్‌’ ఓటీటీ రిలీజ్​ ఎప్పుడంటే?

0
71

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ భీమ్లానాయక్’. పవన్ కళ్యాన్ స్టామినాను మరోసారి నిరూపిస్తూ.. భారీగా కలెక్షన్లను కొల్లగొడుతోంది. మళయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రిమేక్ గా వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలైంది. రానా, నిత్యామీనన్, సంయుక్త మీనన్ లీడ్ రోల్స్ వచ్చిన ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

సాగర్‌ కె.చంద్ర దర్శకుడు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. థియేటర్లలో దుమ్ముదులిపిన ఈ సినిమా ఓటిటి రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్​ దక్కించుకున్న ‘ఆహా’ తాజా ఈ చిత్ర రిలీజ్​పై ట్వీట్​ చేసింది. ఇప్పటి వరకు థియేటర్లలో దుమ్ము రేపిన భీమ్లా నాయక్​ ఇక ఇంట్లో కూడా మాస్​ జాతరను కొనసాగించనుంది. మార్చి 25 నుంచి ఆహా వేదికగా రానుంది.