వివేక్ ఆత్రేయా దర్శకత్వంలో నానికి జోడీగా నజ్రియా హీరోయిన్‌గా నటించిన సినిమా “అంటే సుందరానికి” మూవీ. ఈ చిత్రంలో నాని బ్రహ్మణుడి పాత్రలో నటించగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా నటించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.
కమర్షియల్ గా అంత సక్సెస్ కాకపోయినా సినిమా ఫ్యామిలీకి, యూత్ కి కనెక్ట్ అయి మంచి విజయం అందుకుంది. అంటే సుందరానికి సినిమా థియేట్రికల్ రన్ ముగించుకొని ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో జులై 10 నుంచి తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ అధికారికంగా ప్రకటించింది. అంటే సుందరానికి సినిమా పోస్టర్ ని షేర్ చేసి..”సుందర్ అండ్ లీల వెడ్డింగ్ స్టోరీని చూసేందుకు మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తేది గుర్తుంచుకోండి” అంటూ ట్వీట్ చేసింది నెట్‌ఫ్లిక్స్.