అల్లు అర్జున్ ఐకాన్ చిత్రం స్టార్ట్ అయ్యేది అప్పుడేనా?

when the Allu Arjun Icon movie start

0
82

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్గా మారిన విషయం తెలిసిందే. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతో గొప్ప నటుడు బన్నీ. ఇక సినిమా సినిమాకి మరింత స్టైలిష్ గా మారుతూ ఉంటారు బన్నీ.
సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నారు. ఇది రెండు పార్టులుగా రానుంది తొలి భాగం క్రిస్మస్ కి విడుదల కానుంది.

గంధపు చెక్కల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో బన్నీ స్మగ్లర్గా కనిపించనున్నాడని తెలుస్తుంది.
ఇక బన్నీ తర్వాత ఏ సినిమా చేస్తారు అనే దానిపై అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆయన నెక్ట్స్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారట. ఈసినిమా అనౌన్స్ మెంట్ ఎప్పుడో వచ్చింది, కాని వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ సినిమాతో బీజీ అయ్యారు. ఇటు బన్నీ పుష్పతో బిజీ అయ్యారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా సెట్స్ పై పెట్టే అవకాశాలు ఉన్నాయట.

ఐకాన్ మూవీ అన్నీ సెట్ అయితే విజయదశమి రోజున ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక రెగ్యులర్ షూటింగ్ డిసెంబరులో ఉండవచ్చు అంటున్నారు, ఇందులో పూజా హేగ్డే నటించే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి దీనిపై అఫిషియల్ ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.