చంద్రముఖిలో నయనతార కంటే ముందు ఆ హీరోయిన్ కి ఛాన్స్ వచ్చిందట

ఆమె చేసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి.

0
117

కొందరు కొన్ని అవకాశాలను చిత్ర సీమలో ఆ పరిస్దితుల వల్ల వదులుకుంటారు. మరికొందరు కథ నచ్చక ఆ రోల్ నచ్చక వదులుకుంటారు. మరికొందరు డేట్స్ అడ్జిస్ట్ కాక వదులుకుంటారు. ఇక హీరో హీరోయిన్స్ కి ఇలాంటివి అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటాయి. అయితే ఆ సినిమా సూపర్ హిట్ అయితే, అరే అనవసరంగా ఆ సినిమా ఛాన్స్ వదులుకున్నాం అని ఫీల్ అవుతారు.

జయం మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సదా తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలబడింది. తేజ డైరెక్షన్ వచ్చిన జయం మూవీలో నితిన్ సరసన సదా చాలా బాగా నటించింది. ఇక తరువాత ఆమె అనేక చిత్రాల్లో నటించింది. ఎక్కువ ఆమె చేసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి.

ప్రస్తుతం తమిళంలో కిట్టీ పార్టీ అనే మూవీలో కీలకపాత్ర చేస్తోంది సదా. ఓపక్క తెలుగు, తమిళ్ లో అనేక చిత్రాలు చేసి ప్రేక్షకుల ఆదరణ పొందింది.అపరిచితుడు మూవీలో విక్రమ్ సరసన నటించి మంచి పేరు సంపాదించింది. అయితే చంద్రముఖి సినిమాలో ముందు ఆమెకి అవకాశం వచ్చిందట. కాని ఆమె ఈ రోల్ చేయలేదు. నయనతార చేసిన ఈ రోల్ కు ఎంత పేరు వచ్చిందో తెలిసిందే.