పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో OG కి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమాలో పవన్ లుక్స్‌కి, స్టోరీ లైన్‌కి ఇప్పటికే నెవ్వర్ బిఫోర్ రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ కోసమే కదా ఇన్నాళ్లూ ఎదురు చూసింది..! అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం ముందడుగు పడటం లేదు. ఈ సినిమా ఆలస్యం కావడానికి అసలు కారణం పవన్ కల్యాణే కారణం. ఏపీ పాలిటిక్స్‌లో బిజీ అయిన పవన్.. సినిమాలకు కావాల్సిన టైమ్ కేటాయించలేకున్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్‌కు డేట్స్ కూడా ఇవ్వలేకపోతున్నారు.
మహా అయితే ఇంకా ఒక పదిహేను రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని మూవీ(OG) టీమ్ నుంచి అందుతున్న సమాచారం. కానీ ఆ షూటింగ్ పూర్తి కావాలంటే పవన్ డేట్స్ కావాలి. కానీ ప్రస్తుతం ఆయన డేట్స్ ఇచ్చే పరిస్థితుల్లో లేకపోవడంతో.. ఈ సినిమా ఇంకా ఎంత ఆలస్యమవుతుందా అని అభిమానులు కలత చెందుతున్నారు. ఈ సినిమాకి ఇంకా 12 రోజుల పాటు పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయిస్తే పూర్తవుతుంది. కానీ ఆ 12 రోజులకు ఎప్పుడు డేట్స్ కేటాయిస్తారు? అనే విషయం మీద క్లారిటీ లేదు. సుజిత్(Sujeeth) సహా ఆయన టీం పవన్ ను ఎన్నోసార్లు అప్రోచ్ అయింది. కానీ ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడుస్తుందా? అని అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.