చిరంజీవి మేనల్లుడు.. హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో మంచి విజయం తన ఖాతాలో వేసుకున్నారు, అయితే ఆయన ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేశారు అనే విషయం తెలిసిందే, అయితే దీనికి పలు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.. టాలీవుడ్ వార్తల ప్రకారం ఈ సినిమాకు జంగిల్ బుక్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది ఓ అద్బుతమైన నవల ఆదారంగా ఈ సినిమా తీశారు అని తెలుస్తోంది.
నవలలో ఎక్కువ భాగం కథ నల్లమల అడవులలోని గొర్రెకాపరుల జీవితాలపై నడుస్తుంది. ఇంజనీరింగ్ చదివిన కుర్రాడు, తన తండ్రిని ఆ గొర్రెలను కాపాడుకునే కథతో వస్తోంది ఈ సినిమా… అతను బిటెక్ చదివి ఫారెస్ట్ ఆఫీసర్గా ఎందుకు మారాడు వంటి అంశాలు నవలలో ప్రధాన అంశాలు..
టాలీవుడ్ వార్తల ప్రకారం ఈ సినిమాలో రకుల్ ఓబులమ్మ అనే పాత్రను చేసిందట. ముందు ఇది ఓటీటీలో రిలీజ్ చేయలి అని అనుకున్నారు కాని ఉప్పెన్ భారీ హిట్ అవ్వడం, జనాలు థియేటర్లకు రావడంతో ఇప్పుడు ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది… ఈ సినిమాను ఆగస్టులో విడుదలచేయాలని చూస్తున్నారట.