తమిళ సినీ హీరో విశాల్ కోలీవుడ్ టాలీవుడ్ లో సూపర్ హీరోగా కొనసాగుతున్నారు, సినిమాల్లో ఆయన సత్తా ఏమిటో తెలిసిందే.. నిర్మాతలకు దర్శకులకి ఫేవరెట్ హీరో విశాల్, ఇక నిర్మాతల సంఘం, నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీ చేసి, గెలుపొందాడు. ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి కోలీవుడ్ లో.
ఎందుకు అంటే ఇప్పుడు తమిళనాట ఎన్నికలు జరుగనున్నాయి వచ్చే ఏడాది, ఈ సమయంలో చెన్నైలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని విశాల్ భావిస్తున్నాడట. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారని తెలుస్తోంది, అంతేకాదు తన అభిమాన సంఘాల నేతలతో చర్చలు చేస్తున్నారట, అయితే ఆయన ఏ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తారు అనేది త్వరలో తెలియనుంది.
గతంలోనే జయలలిత మృతి వల్ల ఆర్కే నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో పోటీ చేయడానికి విశాల్ రెడీ అయ్యాడు.
తమ మద్దతు దారులతో కలిసి నామినేషన్ వేశారు, కాని ఆయనని ప్రతిపాదించిన వారు మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ నామినేషన్ తిర్కరణకు గురైంది… సో వచ్చే ఏడాది జరిగే తమిళనాడు ఎన్నికల్లో కమల్ తో పాటు రజనీ కూడా పోటీ చేయనున్నారు.