నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి, అభిమానులు ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు, ముఖ్యంగా గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి, సింహా, లెజెండ్ సినిమాలు బ్లాక్బస్టర్ హిట్లుగా నిలవడంతో ఈసారి కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఇక బాలయ్యని ఎలా చూపిస్తారా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు… ఇక భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు..అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నారు, ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్గా నటిస్తున్నారు. తాజాగా ఓ వార్త వినిపిస్తోంది, ఇందులో షూటింగ్ లో భాగంగా ఓ ఆలయాన్ని నిర్మిస్తున్నారట, ఇక్కడ దాదాపు ఓ కీలక సన్నివేశం షూటింగ్ చేయనున్నారు.
ఎమోషనల్, యాక్షన్ డ్రామాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన దర్శకుడు బోయపాటి శ్రీను ఈ ఆలయ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారట, ఇక ఇక్కడ పది రోజుల షూటింగ్ తర్వాత కర్ణాటకలో మరో కీలక షెడ్యూల్ చేయనున్నారట…