బిగ్ బాస్ ఇంటి సభ్యుల్లో యాంకర్ విష్ణుప్రియ ఎవరికి సపోర్ట్

Who among the members of the Bigg Boss family supports anchor Vishnu priya?

0
84

బిగ్ బాస్ హౌస్ లో ఆట రసవత్తరంగా సాగుతోంది. తొలి రెండు రోజులు ఒకరికి ఒకరి పరిచయాలు అయ్యాయి తర్వాత రోజు నుంచి ఆట మరింత మజాగా మారింది. అయితే ఈసారి ఇటు అమ్మాయిలు అబ్బాయిలు గేమ్స్ విషయంలో పోటీ పడుతూ ఆడుతున్నారు. తగ్గేదేలే అంటున్నారు ఇక వీరికి బయట నుంచి ఫ్యాన్స్ బేస్ పెరిగింది. సినిమా ఇండస్ట్రీ నుంచి, బుల్లితెర నుంచి పలువురికి సపోర్ట్ పెరుగుతోంది.

ఇక సెలబ్రెటీలు కూడా ఈసారి బాగానే ఉన్నార‌ వీరికి బయట ఉన్న సన్నిహితులు సపోర్ట్ చేస్తున్నారు . ఇక ఈసారి యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ కు యాంక‌ర్ ర‌వికి భారీ మద్దతు బయట నుంచి వస్తోంది, తొలి వారం కాస్త సైలెంట్ గా ఉన్న షణ్ముఖ్ సెకండ్ వీక్ నుంచి కాస్త జోరు పెంచాడు.

తాజాగా షణ్ముఖ్ గురించి మాట్లాడింది ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ. షణ్ముఖ్ చాలా మంచివాడు, జెన్యూన్ పర్సన్ అని చెప్పుకొచ్చింది. ఎవరు సపోర్ట్ చేయకున్నా సొంతంగా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఎదిగాడని అతనిని మెచ్చుకుంది. అయితే తాను బిగ్ బాస్ చూడను, అందుకే ఎవరికి సపోర్ట్ చేయను అని చెప్పింది.