ఎవరు మీలో కోటీశ్వరులు: మహేష్ గెలుచుకున్న మనీ ఎంతో తెలుసా?

Who among you are billionaires: Do you know how much money Mahesh has won?

0
153

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా టీవీ షోలను విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇప్పటికే రియాలిటీ షో బిగ్ బాస్‌‌‌కు హోస్ట్‌‌‌గా వ్యవహరించి అందరిని ఆకట్టుకున్నారు తారక్. ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ ప్రేక్షకులముందుకు రావడానికి సిద్దమయ్యారు.

ఇక ఈ షోకు ఇప్పటికే సినిమా తారలు హాజరయ్యారు. మొదటి గెస్ట్‌గా తారక్ మిత్రుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఆతర్వాత టాప్ డైరెక్టర్స్ రాజమౌళి, కొరటాల శివ కలిసి ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం కు వచ్చి సందడి చేశారు. ఆతర్వాత బ్యూటీఫుల్ హీరోయిన్ సమంత, మ్యూజిక్ సెన్సేషన్స్ తమన్ – దేవీశ్రీ హాజరయ్యారు.

ఇక ఈ షోకు సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరు కానున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. ఇటీవలే ఆ వార్తలను నిజం చేస్తూ పోస్టర్ ను వదిలారు. అలాగే రీసెంట్ గా ప్రోమోను కూడా విడుదల చేశారు. మహేశ్‌ బాబు పాల్గొన్న ఎపిసోడ్‌ త్వరలో ప్రసారం కానుంది.

అయితే ఇప్పుడు మహేష్ బాబు ఈ గేమ్ షోలో ఎంత గెలుచుకున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు రూ. 25 లక్షలు గెలుచుకున్నాడని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆ మొత్తాన్ని అంతా ఛారిటీ కోసం  కేటాయించారని తెలుస్తుంది. మహేష్ మరోసారి మంచి మనసు చాటుకున్నారంటూ ఫాన్స్ ఖుష్ అవుతున్నారు.