ఎవరు మీలో కోటీశ్వరులు- పూనకాల ఎపిసోడ్‌ లోడింగ్‌..ఈ సారి గెస్ట్ ఎవరో తెలుసా?

Who among you are billionaires- Loading Poonakala episode..Do you know who is the guest this time?

0
90

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోన్న రియాల్టీ గేమ్‌ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. మధ్యతరగతి వారి కలలను సాకారం చేయడం సహా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ గేమ్‌ షో విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఇంతకుముందు ఈ షోకు డైరెక్టర్  కొరటాల శివ, హీరోయిన్ సమంత, థమన్, దేవిశ్రీప్రసాద్ పాల్గొని అలరించారు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ వంతు వచ్చింది. అవును హీరో మహేష్ బాబు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో పాల్గొననున్నారు. ఒకరు సూపర్‌స్టార్‌.. మరొకరు యంగ్‌ టైగర్‌.. ఈ ఇద్దరూ స్టార్‌ హీరోలను కలిసి చూడడానికి అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్‌ త్వరలో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ప్రోగ్రామ్‌ టీమ్‌ ఓ స్పెషల్‌ పోస్టర్‌ను నెట్టింట్లో షేర్‌ చేసింది. ‘పూనకాల ఎపిసోడ్‌ లోడింగ్‌’ అని పేర్కొంది. దీంతో నెటిజన్లు.. “మేము కూడా ఇక్కడ వెయిటింగ్‌” అంటూ కామెంట్లు చేస్తున్నారు.