మీలో ఎవరు కోటీశ్వరులు- తారక్, మహేష్ ఎపిసోడ్‏ ప్రోమో చూశారా?

Who among you is a millionaire- did you watch the Tarak, Mahesh episode promo?

0
114

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోన్న రియాల్టీ గేమ్‌ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. మధ్యతరగతి వారి కలలను సాకారం చేయడం సహా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ గేమ్‌ షో విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఇంతకుముందు ఈ షోకు డైరెక్టర్  కొరటాల శివ, హీరోయిన్ సమంత, థమన్, దేవిశ్రీప్రసాద్ పాల్గొని అలరించారు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ వంతు వచ్చింది. అవును హీరో మహేష్ బాబు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో పాల్గొననున్నారు. ఒకరు సూపర్‌స్టార్‌.. మరొకరు యంగ్‌ టైగర్‌.. ఈ ఇద్దరూ స్టార్‌ హీరోలను కలిసి చూడడానికి అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

తాజాగా మహేష్ బాబు ఎపిసోడ్‏కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో మహేష్ అన్నకు స్వాగతం అంటూ ఆహ్వానించారు తారక్. నా రాజా అంటూ ఎన్టీఆర్ జోష్ నింపాడు.. ఇక సెటప్ అదిరిపోయిందంటూ బదులిచ్చాడు మహేష్. కరెక్ట్ ఆన్సర్‏ను అటు తిప్పి, ఇటు తిప్పి ఎందుకు అని మహేష్ ప్రశ్నించగా..సరదాగా అంటూ నవ్వులు పూయించాడు ఎన్టీఆర్. నీకంటే గురువు గారు బేటర్‏గా ఉన్నారని మహేష్ చెప్పడంతో తారక్ నవ్వుతూ కనిపించాడు. ఇక ఇద్దరు స్టార్ హీరోలు ఓకే స్టేజ్ పై సందడి చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

ప్రోమో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?time_continue=4&v=DCwU8pNi9A8&feature=emb_title