తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. జూన్ నెల లోనే ఈసారి బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కాని కరోనా సెకండ్ వేవ్ వల్ల మరింత ఆలస్యం అవుతోంది. అయితే ఆగస్ట్ లో సీజన్ 5 పట్టాలెక్కే అవకాశం ఉంది. గత నాలుగు నెలలుగా చాలా మంది కంటెస్టెంట్ల పేర్లు వైరల్ అవుతున్నాయి.
అంతేకాదు వారితో ఇప్పటికే నిర్వాహకులు చర్చలు జరిపారని వార్తలు వినిపించాయి. ఈసారి కూడా హైదరాబాద్ లోనే సెట్ వేస్తారని, కింగ్ నాగార్జున హోస్ట్ గా ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. జూమ్ ద్వారా కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేస్తున్నారని బుల్లితెర వర్గాల టాక్.
ఫైనల్ లిస్టు ఖరారైతే, వారిని జూలై 15 నుంచి క్వారంటైన్ పూర్తి చేసి హౌస్ లోకి పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి వైరల్ అవుతున్న కంటెస్టెంట్లు లిస్ట్ చూద్దాం.
శేఖర్ మాస్టర్
మంగ్లీ
హైపర్ ఆది
యాంకర్ వర్షిణి
టీవీ న్యూస్ యాంకర్ ప్రత్యూష
షణ్ముఖ్ జశ్వంత్
టిక్ టాక్ ఫేమ్ దుర్గారావు ప్రవీణ్ కమెడియన్
యాంకర్ శివ