విడుదలైన తొలిరోజు ఉప్పెన మూవీ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.. ఇక దర్శకుడి ప్రతిభ అలాగే సినిమాలో నటుల నటన, ఇక హీరో వైష్ణవ్ తేజ నటన ఇవన్నీ కూడా మంచి మన్ననలు అందుకుంటున్నాయి. మెగా హీరోగా అతను కూడా కచ్చితంగా నిలబడతాడు అంటున్నారు మెగా అభిమానులు.. సినిమాలో అతని నటన చాలా బాగుంది అంటున్నారు.
ఈ సినిమాకి రివ్యూస్ కూడా పాజిటివ్గా రావడంతో దర్శకుడు బుచ్చిబాబు సానా టేకింగ్కి మంచి ప్రశంసలు దక్కాయి, ఇక ఆయన నెక్ట్స్ ఎవరితో సినిమా అనేది కూడా వెయిట్ చేస్తున్నారు, ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు కొన్ని విషయాలు తెలిపారు.
ముందు ఈ సినిమా స్టోరీ రాసిన సమయంలో ఈ స్టోరికి హీరోగా విజయ్ దేవరకొండ అయితే బెటర్గా ఉంటుందేమో అని భావించారట. కానీ వైష్ణవ్ తేజ్ను చూడగానే అతని కళ్ళు బాగా నచ్చడంతో ఇతను బాగా సెట్ అవుతాడు అని భావించారట.. ఇక విజయ దేవరకొండ రేంజ్ ఇప్పుడు బాగా పెరిగింది.. సో ఆరేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఆయన అభిమానులు కోరుకుంటారు.. అందుకే
వైష్ణవ్ తేజ్ను ఈ కథకు సెలక్ట్ చేసుకున్నారట.