ఇటీవల హీరో రవితేజ – గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా వచ్చింది.. ఈ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే, ఇక ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది, అయితే ఇప్పుడు ఈ దర్శకుడు గోపిచంద్ కు మంచి అవకాశాలు వస్తున్నాయి.. చాలా మంది స్టార్ హీరోలు సినిమా కథలు వింటున్నారు, అయితే తాజాగా టాలీవుడ్ లో ఓ వార్త వినిపిస్తోంది.
క్రాక్ కు ముందే తాను బాలకృష్ణతో ఓ సినిమా కమిట్ అయ్యారట.. ఇప్పుడు ఆ కథపై వర్క్ జరుగుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక తాజాగా బాలయ్య బాబు సెట్స్ పై పెట్టిన బోయపాటి సినిమా పూర్తి అయిన వెంటన గోపిచంద్ సినిమా తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
బాలయ్య బోయపాటి సినిమా మే 28న థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తారు… ఇక ఆ సమయంలో గోపిచంద్ చిత్రం కూడా షూటింగ్ ప్రారంభం కానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు.. కాని చర్చలు జరుగుతున్నాయట… బాలయ్య అభిమానులు ఈ వార్తతో చాలా ఆనందంలో ఉన్నారు.