బాలీవుడ్ కు అల వైకుంఠపురములో – హీరో హీరోయిన్ ఎవరంటే?

who is Hindi Ala vaikuntapuramlo Movie heroine

0
99

అల్లు అర్జున్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం అల వైకుంఠపురం. ఇక సాంగ్స్ గురించి మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. త్రివిక్రమ్ బన్నీ కాంబోలో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. రిలీజ్ అయిన ప్రతి సెంటర్ లో ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది.

ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ కోసం బాలీవుడ్ కి చెందిన బడా నిర్మాతలు పోటీపడ్డారు. కాని నిర్మాత అల్లు అరవింద్ మాత్రం దీనిపై అంత ఇంట్రస్ట్ చూపించలేదు. అయితే తాజాగా బీటౌన్ లో వినిపిస్తున్న వార్తలు చూస్తే ఈ చిత్రం బాలీవుడ్ లో చేయనున్నారట.

హిందీలో రీమేక్ చేయడానికి అల్లు అరవింద్ రెడీ అవుతున్నారని అంటున్నారు. అయితే బాలీవుడ్ లో ఈ చిత్రం చేస్తే ఇక సూపర్ హిట్ అని అక్కడ మీడియా కూడా అంటోంది. అయితే హీరోగా ఎవరు అంటే కార్తీక్ ఆర్యన్ చేసే అవకాశం ఉందట. అలాగే హీరోయిన్ గా కృతి సనన్ ను అనుకుంటున్నారట. కాస్త ఈ కరోనా కేసులు తగ్గిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది అంటున్నారు.