సంక్రాంతికి ఎవరు మెప్పిస్తారు?

సంక్రాంతికి ఎవరు మెప్పిస్తారు?

0
107

ఒకప్పుడు టాలీవుడ్లో అగ్ర కథానాయికలు అయిన ఈ అందాల భామలు తర్వాత ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోయారు. ఒకరు రాజకీయాల్లోకి మరొకరు బాలీవుడ్లోకి వెళ్లారు. అభిమానులు మళ్లీ వాళ్లని తెరపై చూస్తామా..?అని అనుమానపడ్డారు. ఒకప్పటి టాప్ హీరోయిన్లందరూ తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. అమ్మ , అత్త, అమ్మమ్మల పాత్రల్లో నేర్పిస్తున్నారు.

నదియా రమ్యకృష్ణ సుహాసిని ఖుష్బూ లాంటి కొంతమంది అప్పటి హీరోయిన్లు ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నారు. ఒకప్పుడు నెంబర్ వన్ రేసులో ఉన్న నటి లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి. రాజకీయాల వైపు మొగ్గు చూపింది. ఆమెతో సినిమాలు చేయాలని ఎంతో మంది దర్శక నిర్మాతలు ప్రయత్నించినా కాలేదు.అయితే అనిల్ రావిపూడి అభ్యర్థన మేరకు మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో మొదటిసారి గా నటిస్తుంది.

సినిమాలో ఓ కీలకమైన పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఇక అప్పట్లో కూలి నెంబర్ లాంటి సినిమాలతో తన అందాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన టబు మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న అల వైకుంఠపురం సినిమాలో ఒక కీలక పాత్రలో టాబు నటిస్తుంది. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఒకప్పటి టాప్ హీరోయిన్ ల మధ్య పోటీ నెలకొంది. వీరిద్దరిలో సంక్రాంతికి ఎవరు మెప్పిస్తారో వేచి చూడాల్సిందే.