మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఓ గొప్ప హీరో అనే చెప్పాలి, కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకున్న అందరివాడు మెగాస్టార్, అయితే ఆయన సినిమాల జోరు పెంచారు. ఖైదీ నెంబర్ 150, సైరా, తర్వాత ఆయన ఆచార్య సినిమా చేస్తున్నారు, ఇక ఈ సినిమా తర్వాత ఆయన లూసిఫర్ చిత్రం చేయనున్నారనే వార్తలు వినిపించాయి.
అంతేకాదు వరుసగా కథలు వింటూ సినిమాలు ఒకే చేస్తున్నారు అని తెలుస్తోంది, కాని దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రావడం లేదు, తాజాగా టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో గురించి టాక్ వినిపిస్తోంది.
బాబీ దర్శకత్వంలో చిత్రం చేయాలి అని భావిస్తున్నారట చిరు.
ఇక తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రం నిర్మించే అవకాశం ఉంది అని తెలుస్తోంది. అయితే లూసిఫర్ సినిమా కంటే ముందు అంటే ఆచార్య తర్వాత ఈ సినిమా తెరకెక్కించే అవకాశం ఉంది అని టాక్స్ వినిపిస్తున్నాయి, ఈ స్టోరీ లైన్ వర్క్ కూడా పూర్తి చేస్తున్నాడట దర్శకుడు బాబి, మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.