మన తెలుగు దర్శకులు కొందరు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు… అంతేకాదు నేరుగా హిందీ నటులతో డైరెక్ట్ సినిమాలు కూడా చేస్తున్నారు, ఇక్కడ హిట్లు కొట్టే యువ దర్శకులకు బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. మంచి స్టోరీతో నేరుగా బీ టౌన్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు..యువ దర్శకుడు సుజిత్ కూడా బీ టౌన్ కు వెళ్లనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
శర్వానంద్ తో రన్ రాజా రన్ సినిమా తీశారు, ఆయన కెరియర్లో ఈ సినిమా మంచి హిట్ సంపాదించింది, ఇక తర్వాత ప్రభాస్ తో నేరుగా సినిమా చేశారు, సాహో సినిమా ఆయనకి మంచి ఫేమ్ తెచ్చింది, అయితే ఇక్కడ హిందీ అభిమానులకి ఈ సినిమా బాగా నచ్చింది, ఇక ఇటీవల చిరుతో లూసిఫర్ సినిమా చేస్తున్నారు అని వార్తలు వినిపించినా ఆ సినిమా చేజారింది.
తాజాగా సుజిత్ కు బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో సినిమా చేసే అవకాశం వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లాక్ డౌన్ సమయంలో ఓ మంచి స్టోరీ రాశారట, ఈ లైన్ విక్కీ కౌశల్ కు నచ్చడంతో ఆయన ఒకే చెప్పారట, ఈ సినిమా బాలీవుడ్ ప్రముఖ సంస్ధ నిర్మించనుంది అని బీ టౌన్ టాక్, దీనిపై ఇంకా ప్రకటన రావాల్సి ఉంది.