రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు, ఇక ఆయన సినిమాలతో వచ్చే రెండేళ్లు బిజీ అనే చెప్పాలి, ఇక ఇప్పటికే రాధేశ్యామ్ సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్ తర్వాత ఆదిపురుష్ సినిమా అనౌన్స్ చేశారు, ఇక వరుస పాన్ ఇండియా సినిమాలకు ఓకే చెప్పాడు.
ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆదిపురుష్ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది జనవరి నుంచి, ఇక తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్తో మరో సినిమాకు పచ్చ జెండా ఊపాడు. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. సలార్ అనే సినిమా పేరుతో చిత్రం తెరకెక్కనుంది, ఈ చిత్రం వచ్చే నెల నుంచి స్టార్ట్ కానుంది.
ఇక ఈ సినిమాలో కథానాయిక ఎవరు అంటే బాలీవుడ్ బ్యూటి పేరు వినిపిస్తోంది, తాజాగా చాలా మంది పేర్లు వినిపించాయి, అయితే ఇప్పుడు బీటౌన్ లో ప్రశాంత్ సలార్ సినిమాకి దిషా పటానీని తీసుకుంటారు అని తెలుస్తోంది, దీనిపై వార్తలు వినిపిస్తున్నాయి మరి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.