మెగాస్టార్ – బాబీ సినిమాలో హీరోయిన్ ఎవరు ?

Who is the heroine in the movie of Megastar- Bobby

0
93

మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆచార్య సినిమా తెరకెక్కుతోంది. మరో రెండు సినిమాలు సిద్దం అవుతున్నాయి సెట్స్ పైకి వెళ్లేందుకు. తాజాగా దర్శకుడు బాబీతో ఓ సినిమా చేయనున్నారు మెగాస్టార్. ఇక ఈ సినిమాలో చిరు డ్యూయల్ రోల్ చేయనున్నారు అని తెలుస్తోంది. అయితే ఇందులో ఇద్దరు భామలు నటించే అవకాశం ఉంది. ప్రధానంగా ఓ హీరోయిన్ ని బాలీవుడ్ నుంచి తీసుకువస్తున్నారు అనే వార్తలు వినిపించాయి.

ఆ పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను తీసుకోవాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. ఇక ఈ జంట స్క్రీన్ పై చాలా బాగుంటుందని భావించారు. అయితే దర్శక నిర్మాతలు ఇప్పటికే ఆమెని మీట్ అయ్యారు అని టాలీవుడ్ లో వార్తలు వినిపించాయి. ఆమె మెగాస్టార్ తో సినిమా అనగానే ఒకే చెప్పారట, అయితే రెమ్యునరేషన్ గురించి చ‌ర్చ‌లు జరుపుతున్నార‌ట‌.

మరో హీరోయిన్ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. అన్నీ సెట్ అయితే సోనాక్షిని తీసుకునే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. రెండో హీరోయిన్ గా కోలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవ‌చ్చు అంటున్నారు. అయితే ప్రస్తుతం రెండు సినిమాలు పూర్తి అయ్యాక బాబి సినిమా పట్టాలెక్కనుంది.