Who is the hit-2 killer :హిట్ -2 కిల్లర్ ఎవరో..?

-

Who is the hit-2 killer It will be known today: అడివి శేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్-2 కొన్నిగంటల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ మూవీ హిట్‌-1 కు సీక్వెల్‌గా వస్తోంది. హిట్-1 లో విశ్వక్‌సేన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. హిట్-2 లో అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్నారు. కాగా.. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. వాల్ పోస్టర్ బ్యానర్ పై హీరో నాని ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కొన్నిగంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాగా.. సినిమాలో విలన్ ఎవరు..? ఆ కిల్లర్ ఎవరు? (Who is the hit-2 killer) అనే విషయాన్ని బయటపెట్టలేదు. కొన్నిగంటల్లో ఆ సర్ ప్రైజ్ తెలవనుంది. కిల్లర్ ఎవరు అనేది చెప్తాను అని శేష్  గురువారం ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోను క్లిక్ చేయగా అడవి శేష్ మాట్లాడుతూ..

- Advertisement -

‘‘కిల్లర్ ఎవరో తెలుసుకోవడానికి మీరు ఈ వీడియోని క్లిక్ చేశారు. రేపు సినిమా చూసాకా కిల్లర్ ఎవరు..? ట్విస్ట్ ఏంటి..? అని ఎవరితో పంచుకోకండి. స్పాయిలర్ చేయకండి. మేము రెండేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డాము. మీరు రెండు నిమిషాల సరదా కోసం దయచేసి మూవీని రివీల్ చేయకండి. మీకు తెలుసు నేను సినిమా చూపించడానికి భయపడను. మేజర్ సినిమాను రెండు వారాల ముందే చూపించాను. కానీ.. ఈ సినిమా అలా కాదు. అందరు థియేటర్ లోనే చూడాలి. ఇప్పటివరకు ఎవరికి ఈ సినిమా చూపించలేదు. దయచేసి ధ్రిల్ ను పాడుచేయకండి ప్లీజ్.. అని చెప్పుకొచ్చాడు.’’

హిట్-2 మూవీపై మొదటి నుంచి సినీ అభిమానుల్లో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అంచనాలకు తగ్గాటే.. బిజినెస్ కూడా భారీ మొత్తంలో జరిగింది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని తెలంగాణ (నైజాం)లో 201 పైగా థియేటర్స్‌లో విడుదల కానుంది. సీడెడ్‌లో 90, ఆంధ్రాలో 245 వరకూ అంటే మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి 550 నుంచి 600 థియేటర్లలో విడుదల అవుతోంది. కర్ణాటక + రెస్టాఫ్ భారత్ = 85 ఇక ఓవర్సీస్‌లో 320 స్క్రీన్స్‌లో హిట్2 విడుదల కానుంది. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 955 నుంచి 1000 థియేటర్లలో రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. అయితే.. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో … ఈ రోజు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...