అక్కినేని నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ నిమిత్తం మనాలీ వెళ్లారు మూడు వారాలు అక్కడే ఉంటారు, అయితే బిగ్ బాస్ ఇంటి బాధ్యతని సమంతకి అప్పగించారు, దసరా సమయంలో ఆ వీకెండ్ లో సమంత హోస్ట్ చేశారు, ఇంటి కోడలుగా అద్బుతంగా ఆమె హోస్ట్ చేసింది, మరి ఈ వారం ఎవరు హోస్ట్ గా వస్తారు అనే దానిపై చర్చ జరుగుతోంది.
అంతేకాదు 11 మంది ఇంటి సభ్యుల ఆట ఇప్పుడు అసలు సిసలుగా ఆడుతున్నారు, ఈ సమయంలో తప్పులు ఒప్పులు చెప్పాలి ప్రశ్నించాలి సో ఇవన్నీ సమంత చేస్తుందా అనేదిపెద్ద ప్రశ్న, అయితే తాజాగా వీకెండ్ లో కేవలం ఆదివారం మాత్రమే నాగార్జున వస్తారు అని వార్తలు వస్తున్నాయి.
శనివారం సాధారణంగా హౌస్ నడిపిస్తారు అని అంటున్నారు. ఈ వారం నాగార్జునే షోకు హోస్టుగా వ్యవహరించనున్నాడని తెలుస్తోంది. కేవలం ఆదివారం మాత్రమే ఆయన షూట్ కి వస్తారని మళ్లీ మనాలి ఒక్క రోజు ఇక్కడ షూట్ చేసి వెళ్లిపోతారు అని అంటున్నారు బిగ్ బాస్ అనలిస్టులు.