త్వరలో పెళ్లిపీటలెక్కనున్న స్టార్ హీరో కూతురు..ఇంతకీ ప్రియుడు ఎవరంటే?

0
100

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తనదైన స్టైల్ లో సినిమాలు తీసి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం అమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఇరా ఖాన్ ఫిట్‌నెస్ ట్రైనర్ నూపుర్ శిఖారే పెళ్లి ప్రపొజల్​కు ఓకే చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా వీరి ఎంగేజ్​మెంట్​ విషయాన్ని ఐరా ఇన్​స్టాలో ఓ వీడియో ద్వారా షేర్​ చేసింది. దాదాపు రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట తమ ప్రపోజల్​ను ఇన్​స్టాలో షేర్ చేయడంతో నెటిజన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. దీంతో అటు అభిమానులు ఇటు స్నేహితులు, సన్నిహితులు అభినందనలు తెలిపారు.