రామ్ – లింగుస్వామి సినిమాలో విలన్ గా చేసేది ఎవరంటే ?

ప్రతినాయకుడి పాత్ర కోసం తమిళ హీరోను రంగంలోకి దించే పనిలో ఉన్నారట

0
95

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు యంగ్ హీరో రామ్ . వరుస పెట్టి చిత్రాలు చేస్తున్నారు. తర్వాత రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక తాజాగా మరో సూపర్ ప్రాజెక్ట్ ని చేస్తున్నారు. తమిళ దర్శకుడు లింగు స్వామితో ఓ సినిమా చేస్తున్నారాయన .ఇటీవలే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేశారు.
అందాల భామ కృతి శెట్టి ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో చాలా మంది సీనియర్ నటులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు. అంతేకాదు తెలుగు తమిళ చిత్ర సీమలో కొందరు నటులని ఎంపిక చేస్తున్నారట. ఇక రెండు రోజులుగా ఓ టైటిల్ కూడా వైరల్ అవుతోంది.
ఉస్తాద్ అనే ఆసక్తికరమైన టైటిల్ ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సినిమాలో విలన్ పాత్ర కూడా చాలా ముఖ్యం.

అందుకే ప్రతినాయకుడి పాత్ర కోసం తమిళ హీరోను రంగంలోకి దించే పనిలో ఉన్నారట దర్శకుడు లింగుస్వామి.
విలన్ పాత్రలో ఆర్య నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాలో విలన్గా నటించి ఎంతో పేరు సంపాదించారు ఆయన. సైజ్ జీరో సినిమాలో అనుష్క సరసన నటించారాయన. చూడాలి దీనిపై అఫిషియల్ ప్రకటన వచ్చే వరకూ అంటున్నారు టాలీవుడ్ సినిమా అభిమానులు.