టాలీవుడ్ చిత్ర సీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా తన నటనతో ఆకట్టుకున్నారు నర్సింగ్ యాదవ్, దురదృష్టవశాత్తు ఆయన ఇటీవల కన్నుమూశారు.. కిడ్నీ సంబంధిత వ్యాధితో సోమాజీగూడ యశోద హాస్పిటల్లో చేరిన నర్సింగ్ యాదవ్
చికిత్స తీసుకుంటూ గత ఏడాది చివరన డిసెంబర్ 31న మనల్ని విడిచి వెళ్లిపోయారు… తన మరణంతో చిత్ర సీమ సంతాపం తెలిపింది.
నర్సింగ్ యాదవ్ భార్య చిత్ర ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ నర్సింగ్ యాదవ్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు..
చిరంజీవి గారంటే ఆయనకు చాలా ఇష్టమని, ఇక హీరోయిన్లలో సౌందర్య నటన అంటే చాలా ఇష్టం అని తెలిపారు.. ఆయన మరణం తర్వాత ప్రముఖులు ఫోన్ చేసి పరామర్శించారు అని తెలిపారు.
ఆయన మరణించారని తెలియగానే సినీ ప్రముఖులంతా ఫోన్ చేశారని, ముఖ్యంగా జీవిత రాజశేఖర్ గారు ప్రతిక్షణం అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారని చిత్ర చెప్పారు. ఇక క్రీడా ప్రముఖుల్లో సచిన్ ఆయనకు చాలా క్లోజ్ గా ఉంటారు అని సచిన్ అయితే తమ ఇంటికి కూడా వచ్చారని తెలిపింది ఆమె. ఇటీవల అనారోగ్యం కారణంగా ఆయన ఇబ్బంది పడ్డారు అని ఆమె తెలిపారు. ఎంతో బిజీ బిజీగా సినిమాలు చేసేవారు అని భర్త గురించి తెలిపారు ఆమె.