భార్య‌ని ఆస్ప‌త్రికి తీసుకువెళ్లిన అక్ష‌య్ కుమార్ ఎందుకంటే

భార్య‌ని ఆస్ప‌త్రికి తీసుకువెళ్లిన అక్ష‌య్ కుమార్ ఎందుకంటే

0
86

ఇప్పుడు దేశంలో బాగా వినిపిస్తున్న పేరు అక్ష‌య్ కుమార్ ది… సినిమా ఇండ‌స్ట్రీ నుంచి భార‌త్ లో ఏకంగా పీఎం కు క‌రోనా క‌ట్ట‌డికి 25 కోట్ల విరాళం ఇచ్చారు, దీనిపై ఆయ‌న‌కు దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు వ‌స్తున్నారు, ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా తాను ఎంతో గర్వపడుతున్నా అని తెలిపింది.

అయితే తాజాగా మరో ఆసక్తికర వీడియోతో అభిమానులను కాస్త కలవరపెట్టింది అక్షయ్ భార్య, మాజీ హీరోయిన్ ట్వింకిల్‌. ఆమెని అక్ష‌య్ ఆస్ప‌త్రికి తీసుకువెళ్లాడు, తిరిగి ఇంటికి వ‌స్తున్న స‌మ‌యంలో ఆమె ఓ వీడియోని తీసి కారు నుంచి పోస్ట్ చేశారు.

ఉదయం 10:31, దారులన్నీ ఎడారిని తలపిస్తున్నాయి. కేవలం పావురాలు, కాకులు మాత్రమే కనిపిస్తున్నాయి. అని అన్నారు తన కాలీకి కట్టిన కట్టును చూపించింది ట్వింకిల్‌. నా కాలికి చిన్న గాయం అయింది అందుకే ఆస్ప‌త్రికి వెళ్లాను అని తెలిపారు ట్వింకిల్ ఖ‌న్నా.