టాలీవుడ్ లో కొత్త రికార్డు క్రియేట్ చేసిన అల్లు అర్జున్ భార్య

Wife of Allu Arjun who has created a new record in Tollywood

0
175

సోషల్ మీడియాలో సెలబ్రిటీల సందడి ఎంతలా ఉంటుందో తెలిసిందే. ఇక వారి గురించి అనేక అప్ డేట్స్ వారి సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఇస్తూ ఉంటారు. స్టార్ హీరోలు ఒక్క పోస్ట్ చేస్తే చాలు లక్షల మంది అభిమానులు రియాక్ట్ అవుతుంటారు.
అయితే హీరోలే కాదు వారి భార్యలు అలాగే వారి పిల్లల గురించి వారి సోషల్ మీడియా ఖాతాలు కూడా అభిమానులు ఫాలో అవుతూ ఉంటారు.

లక్షల ఫాలోవర్లతో దూసుకుపోతున్నారు స్టార్ హీరోల భార్యలు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ చాలా మంది స్టార్ హీరోల భార్యలు ఇలా సోషల్ మీడియాలో అనేక అప్ డేట్స్ ఇస్తూ ఉంటారు. ఇక మీ హీరో పిల్లలతో ఎలా ఆడుతున్నారో చూడండి, ఇలా అనేక ఫోటోలు పంచుకుంటూ ఉంటారు.

అయితే టాలీవుడ్ లో అల్లు అర్జున్ భార్య స్నేహ కూడా సరికొత్త రికార్డు సృష్టించారు. అల్లు స్నేహ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 4 మిలియన్ ఫాలోవర్స్తో సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకూ టాలీవుడ్ హీరోల భార్యలకు ఎవరికి లేని ఫాలోయింగ్ ఆమెకి ఉంది. రామ్ చరణ్ భార్య ఉపాసన 3.3 మిలియన్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.