వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ గా చరణ్

వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ గా చరణ్

0
75

సెలబ్రెటీ స్టేటస్ సినిమా హీరోలకి చాలా ఉంటుంది… అయితే సమాజం పై కూడా ప్రేమ అలాగే చూపించే వారు చాలా మంది ఉంటారు.. ముఖ్యంగా మెగా వారసుడు మెగా హీరో రామ్ చరణ్ కు ఇది చాలా ఉంది అని చెప్పాలి.. ఆయన ఏ విషయం పై అయినా వెంటనే రియాక్ట్ అవుతారు. ఆయన కంటే ఆయన భార్య ఉపాసన కూడా వెంటనే సామాజిక అంశాలపై రియాక్ట్ అవుతారు.

సామాజిక సేవను కూడా సమానంగా చూసే జోడీ రామ్ చరణ్, ఉపాసన అని అందుకే అందరూ అంటారు. ఎవరికి అయినా సాయం చేయాలి అన్నా వారు ముందు ఉంటారు. తాజాగా వీరు ఇంటిని చాలా అందంగా తమ అభిరుచులకు అనుగుణంగా తయారు చేసుకుంటున్నారట.

వన్యప్రాణుల సంరక్షణ కోసం రామ్ చరణ్, ఉపాసన కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ఇంటిలోనే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ కోసం ఓ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వీరిద్దరూ హోస్ట్ లుగా ఈ కార్యక్రమం చేసి నిధులు సేకరించనున్నారు. వైల్డెస్ట్ డ్రీమ్స్. దీనికోసం మెగాహీరో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అవతారం ఎత్తాడు. దీనికి సంబంధించిన స్టిల్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. ఏదైనా మెగా హీరోలు తలచుకుంటే కచ్చితంగా అవుతుంది అని అంటున్నారు అభిమానులు.