అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తో కలిసి పుష్ప సినిమా చేస్తున్నారు.. ఇప్పటికే సినిమా విడుదల తేదీ కూడా అనౌన్స్ చేశారు..అయితే దీని తర్వాత ఆయన ఏ సినిమా చేస్తారు అంటే కొరటాల శివ సినిమా అని అందరూ అనుకుంటున్నారు, అయితే తాజాగా బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గురించి ఏదైనా అనౌన్స్ మెంట్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.. అంతేకాదు టాలీవుడ్ లో కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. - Advertisement -
పుట్టినరోజున ఫ్యాన్స్కు డబుల్ ధమాకా ఇవ్వనున్నాడు అని భావిస్తున్నారు… ఏప్రిల్ 8న తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు పుష్ప సినిమాకు సంబంధించిన టీజర్ను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు ఆరోజు తన కొత్త సినిమా గురించి కూడా ప్రకటన చేస్తారు అని తెలుస్తోంది. పుష్ప ఆగష్టు 13న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కొరటాల శివతో చేయబోయే సినిమాకు సంబంధించిన టైటిల్ను అఫీషియల్గా ప్రకటించే అవకాశం ఉందట. సో ఈలోపు మరిన్ని కధలు విన్నారు దానికి సంబంధించి కూడా అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది అని టాక్ నడుస్తోంది.
|
|
|
అల్లు అర్జున్ పుట్టినరోజున ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ఇవ్వనున్నాడా
-