బోయపాటి శ్రీను రవితేజ నటించిన భద్ర సినిమాతో దర్శకుడిగా తన మార్క్ చూపించారు. వరుస సినిమాలతో టాలీవుడ్ లో టాప్ దర్శకుల్లో ఒకరుగా నిలిచారు ఆయన. ఇక ఆయన సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయన అఖండ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే లెజెండ్ , సింహ తర్వాత వస్తున్న మూడో చిత్రం ఇది. దీంతో ఈ సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు అభిమానులు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. చాలా అద్భుతంగా ఈ చిత్ర షూటింగ్ చేస్తున్నారు. అయితే అఖండ సినిమా తర్వాత బోయపాటి ఎవరితో సినిమా చేయబోతున్నాడన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
తాజాగా ఆయన కన్నడస్టార్ హీరో యశ్ తో ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో పాన్ ఇండియా రేంజ్ లో వీరి కాంబో మూవీ వస్తుందని అంటున్నారు. ఈ కథ ఆయన మొత్తం పూర్తి చేశారని తెలుస్తోంది. చూడాలి దీనిపై అఫిషియల్ ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.