గుణశేఖర్ కథలు చాలా బాగుంటాయి. భారీ చిత్రాలు ముఖ్యంగా పౌరాణిక చిత్రాలు చేయడంలో ఆయన ముందు ఉంటారు. ఇక ఆయన టేకింగ్, దర్శకత్వం అమోఘమనే చెప్పాలి.రుద్రమదేవి తరువాత ఆయన ప్రతాపరుద్రుడు సినిమాను రూపొందించాలని అనుకున్నారు కాని ముందుకు సాగలేదు.
ఇక ఇప్పుడు ఆయన శాకుంతలం అనే సినిమాను పట్టాలెక్కించారు. సమంత ప్రధానమైన పాత్రను పోషిస్తున్నారు ఈ చిత్రంలో. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి అయింది. ఇక ఈ చిత్రం పూర్తి అయ్యాక ఆయన హిరణ్యకశిప చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ చిత్రం తర్వాత మరో ప్రాజెక్ట్ ని సిద్దం చేస్తున్నారనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది.
ఆ చిత్రమే ప్రతాపరుద్రుడు. ఇప్పటికే లాక్ డౌన్ సమయంలో ఈ కథపై ఆయన పూర్తిస్థాయి కసరత్తు చేశారట. అయితే ఈ సినిమా మహేష్ బాబుకి అయితే బాగుంటుందనే ఆలోచనలో ఆయన ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.మరి చూడాలి ఈ కథకి ప్రిన్స్ ఏమంటారోనని టాలీవుడ్ టాక్. ఇక ఒక్కడు సినిమా నుంచి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది.