సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు చాలా మంది సీనియర్ హీరోలని నటులని తీసుకుంటున్నారు.. అంతేకాదు ఆ పాత్రకి దాదాపు 100 కి వంద శాతం న్యాయం చేస్తున్నారు.. ముఖ్యంగా చాలా మంది సీనియర్ హీరోలు కూడా ఇప్పుడు ఇలాంటి పాత్రల్లో బాగా నటిస్తున్నారు, అల వైకుంఠపురములో చిత్రంలో.. వ్యాపారవేత్త రామచంద్రగా మలయాళ నటుడు జయరామ్ఎంత బాగా నటించారో తెలిసిందే.
అయితే ఇప్పుడు ఆయన మరోసారి టాలీవుడ్ చిత్రంలో నటిస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి, మరోసారి ఆయన తండ్రి పాత్రలో కనిపించనున్నారని టాలీవుడ్ టాక్, మహేశ్బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారిపాటచిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఆయన నటించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
మహేశ్బాబు తండ్రి పాత్రను జయరామ్ చేస్తున్నారట. జయరామ్ బ్యాంక్ మేనేజర్ అని టాక్. ఈ సినిమా బ్యాంకు మోసాలకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కుతోంది. అయితే ఇందులో పాత్రలు రివీల్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు,
ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నారు, ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పుడు టాలీవుడ్ లో పలు చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు.
ReplyForward
|