కాజల్ అగర్వాల్ చెల్లి మళ్లీ అక్కడ రీ ఎంట్రీ ఇవ్వనుందా ?

Will Kajal Agarwal's sister re-enter there?

0
100

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది. ఇటు టాలీవుడ్ కోలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది ఈ చందమామ. ఇటీవల వివాహం కూడా చేసుకుంది పెళ్లి అయినా సినిమాలు చేస్తాను అని చెప్పింది. అలాగే సినిమాలను చేస్తూనే ఉంది. ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు సినిమాలో హీరోయిన్గా చేస్తుంది. అలాగే మెగాస్టార్ తో ఆచార్య సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది.

ఇక కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్ కూడా హీరోయిన్ గా పలు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. తెలుగులో వరుణ్ సందేశ్ నటించిన ఏమైంది ఈవేళ అనే సినిమాలో నటించింది. సోలో సినిమాలో నారారోహిత్ తో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంతో ఆమెకి చాలా పేరు వచ్చింది. సుకుమారుడు, సరదాగా అమ్మాయితో వంటి సినిమాల్లో నటించి హిట్లు తన ఖాతాలో వేసుకుంది.

తర్వాత నిషా అగర్వాల్ వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయింది. అయినా నిత్యం సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. తాజాగా ఆమె మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఓటీటీ కంటెంట్ తో రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తుందట. ఈ వార్తలు అయితే వినిపిస్తున్నాయి చూడాలి దీనిపై ప్రకటన ఎప్పుడు వస్తుందో.