శంకర్ సినిమా తర్వాత రామ్ చరణ్ ఆ దర్శకుడితో సినిమా చేయనున్నారా?

Will Ram Charan do a film with that director after Shankar movie?

0
86

రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు. ఆచార్యలో కూడా కీలక రోల్ చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్ ఇటీవల పూర్తి అయింది. అయితే తాజాగా ఆయన శంకర్ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. మరో వైపు నిర్మాతగా కూడా బిజీగా ఉన్న చరణ్ తాజాగా మరిన్ని కొత్త కథలు వింటున్నారు. ఇక చాలా మంది దర్శకులు కథలు వినిపిస్తున్నారట. మొన్నటి వరకూ ఆచార్య ఆర్ ఆర్ ఆర్ తో బిజీగా ఉన్న చరణ్ ప్రస్తుతం ఈ గ్యాప్ లో కొన్ని స్టోరీలు వింటున్నారు.

ఈ నెల 8వ తేదీన శంకర్ ప్రాజెక్టు పట్టాలెక్కనుందట. అయితే ఈ సినిమా తర్వాత చరణ్ ఏ దర్శకుడితో సినిమా చేస్తారు అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పేరు వినిపిస్తోంది. ఆయనతో సినిమా చేసే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

కొంతకాలం క్రితమే ఆయన చరణ్ కి ఒక కథను చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. చిన్న మార్పులతో స్టోరీ ఒకే చేశారు అని టాలీవుడ్ టాక్ . ఈ కథ చరణ్ కి నచ్చడంతో ఆయన సినిమా చేయనున్నారు అని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. ఇక శంకర్ సినిమా తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది. చూడాలి దీనిపై అఫిషియల్ గా ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.