దర్శకుడు శంకర్ సినిమాలు అంటే ఓ రేంజ్ లో హైప్ ఉంటుంది అభిమానులకి… భారీ బడ్జెట్ సినిమాలు చేస్తారు… ఇక ఆయన స్టోరీ చెబితే నిర్మాతలు హీరోలు కూడా సినిమాకి ఒకే చెబుతారు…కథకు తనదైన సాంకేతికతను ఉపయోగించుకొని విజయాలు అందున్న శంకర్ ఇటీవల కాస్త స్పీడు తగ్గించారు.. రోబో 2 తర్వాత సినిమా స్టార్ట్ చేశారు ఆయన.
శంకర్..కమల్ హాసన్తో భారతీయుడు2 మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రం పూర్తి అయిన తర్వాత మరో సినిమా చేయనున్నారు.. కాని తాజాగా మరో వార్త వినిపిస్తోంది… ఈ సినిమా తర్వాత మరో ప్యాన్ ఇండియా సినిమా చేయాలి అని చూస్తున్నారట..
ఈ చిత్రాన్ని శంకర్.. కేజీఎఫ్ స్టార్తో నిర్మించే ఆలోచనలో ఉన్నాడని కోలీవుడ్ వార్తలు వినిపిస్తున్నాయి,
యశ్కు కథ వినిపించి ఓకే చేయించుకున్నట్టు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి… అయితే ఇది భారీ బడ్జెట్ చిత్రంగా రానుందట, దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది అని వార్తలు వైరల్ అవుతున్నాయి.