తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ఉన్న హీరో శర్వానంద్ ఆయన పెళ్లి గురించి నిత్యం అనేక వార్తలు వినిపిస్తూ ఉంటాయి, ముఖ్యంగా ప్రభాస్ అలాగే శర్వానంద్ పెళ్లి గురించి ఇప్పుడు అభిమానులు ఎదురుచూస్తున్నారు, ఇక ఇండస్ట్రీలో ఆయనకు బాగా మిత్రుడు అంటే చరణ్ అనే చెప్పాలి, రామ్ చరణ్ శర్వానంద్ ఇద్దరూ చిన్ననాటి మిత్రులు కలిసి చదువుకున్నారు.
ఇక శర్వానంద్ చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చి మంచి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు, అయితే తాజాగా వారిద్దరూ ఇప్పుడు అన్నదమ్ములు అవుతున్నారు అనే వార్త వినిపిస్తోంది చిత్ర సీమలో. శర్వానంద్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు అని టాక్ నడుస్తోంది టాలీవుడ్ లో..
శర్వానంద్ స్నేహితురాలు ఉపాసనకి కజిన్ సిస్టర్ అవుతుందట.. వారిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.. అందుకే చరణ్ శర్వానంద్ అన్నదమ్ములు అవ్వబోతున్నారు అని టాక్ నడుస్తోంది… అయితే దీనిపై శర్వానంద్ నుంచి అఫీషియల్ ప్రకటన వచ్చేవరకూ వెయిట్ చేయాల్సిందే..